హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జర్నలిస్టుల సమస్యలపై MLAకు వినతి

BDK: మణుగూరు: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ TUWJ (IJU) పినపాక నియోజకవర్గ యూనియన్ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన ఇబ్బందులు, ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై MLA సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.