హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సమస్యలపై భగ్గుమన్న రైతన్నలు

MDK: పుల్కల్ మండలం కోడూరు, సిర్గాపూర్ మండలం కడ్పల్ సబ్‌స్టేషన్ల ఎదుట రైతులు విద్యుత్ ఆందోళన చేపట్టారు. అరకొర సరఫరాతో పంటలు ఎండుతున్నాయని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో ఏఈ ప్రసాద్, డీఈ శ్రీనివాసులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి నిరసన విరమించారు.