హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

KMR: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని KMR మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నేడు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని గంజ్ ప్రాంతంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి అదనపు కలెక్టర్ విక్టర్ పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.