BHPL: గణపురం (M) గొల్లపల్లికి చెందిన పెండెల సంపత్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో భార్య సుమలత, ఆమె ప్రియుడు శ్రీకాంత్, మరో నిందితుడు తరుణ్ కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రూ.లక్ష సుపారీతో పథకం వేసి మద్యంలో పురుగుల మందు కలిపి సంపత్‌కు తాగించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య


