JGL: జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో గోనే కాపు రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహాత్మా గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల సింగిల్ విండో ఛైర్మన్ మహిపాల్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మోరపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు


