హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA క్యాంపు కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

NGKL: అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింసా, శాంతి, సామరస్య మార్గాలు నేటి సమాజానికి స్పూర్తిదాయకమని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.