హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రపంచ శాంతికి గాంధీ మార్గదర్శి : ఎమ్మెల్యే

GDWL: గద్వాల జిల్లా కేంద్రంలోని చింతలపేటలో జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి గాంధీ మార్గదర్శి అని కొనియాడారు. దేశం అంతటిని ఒకే తాటిపైకి తెచ్చి స్వాతంత్రాన్ని అందించడంలో గాంధీ కీలక పాత్ర పోషించారన్నారు.