హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీకి అదనపు కమిషనర్ ఘన నివాళి

WGL: గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా, సూపరింటెండింగ్ ఇంజనీర్ పోరిక రాజ్‌కుమార్, వింగ్ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మ గాంధీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కమిషనర్ జోనా అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.