హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి'

ADB: గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ ఫర్హానా ఖానం జిల్లా కలెక్టర్‌ను కోరారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పంచాయతీ భవన మరమ్మతులు, తాగునీరు, విద్యుత్ వసతులతో పాటు 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.