హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడిహత్నూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ADB: గుడిహత్నూర్ మండలంలోని కోలహరి గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకిషన్ మాట్లాడుతూ.. స్వతంత్ర ఉద్యమంలో గాంధీ పాత్ర మరువలేనిది అని అన్నారు. ఆయన ఆశయ సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.