GDWL: అలంపూర్ పట్టణంలోని గాంధీ చౌక్ దగ్గర ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా విగ్రహాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో అధికారులు మరో విగ్రహాన్ని నూతనంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ రాజేష్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: అల్లంపూర్‌లో గాంధీ జయంతి వేడుకలు


