NZB: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)లో సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు వివరాలతో రూ. 3.50 లక్షలు కాజేశారు. వార్షిక ఫీజు రూ. 3,500 మాత్రమేనని, యాప్ ఇన్‌స్టాల్ చేసి వివరాలు అప్‌డేట్ చేస్తే ఛార్జీలు తగ్గుతాయని నమ్మించారు. లింక్ ద్వారా APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయించడంతో ఫోన్‌ను హ్యాక్ చేసి నాలుగు క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు దోచుకున్నారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
తెలంగాణ
క్రెడిట్ కార్డులతో రూ.3.50 లక్షలు స్వాహా


