ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగినట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ తెలిపారు. రూ.11 వేల జీతానికి బదులు రూ.9 వేలు చెల్లిస్తున్నారని, పీఎఫ్, ఈఎస్‌ఐ కార్డులు, యూనిఫామ్స్ ఇవ్వలేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.
తెలంగాణ
ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సమ్మె


