SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 1.598 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, నీటిమట్టం 389.39 మీటర్లుగా ఉంది. 24 గంటల సగటు ప్రకారం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో నిలిచిపోయాయి. ఆవిరి, ఇతర అవసరాల కోసం 6 క్యూసెక్కుల నీరు మాత్రమే బయటకు వెళ్తుంది.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో నిలకడగా నీటి నిల్వలు


