హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాగజ్‌నగర్‌లో ‘సేవా సంకల్ప్ అభియాన్’

ASF: ప్రధాని మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ, ప్రజా సేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'సేవా సంకల్ప్ అభియాన్'ను శుక్రవారం కాగజ్ నగర్ పట్టణంలోని 29వ వార్డులో నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మన ఊరు-మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.