WNP: మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చూపిన అహింస, సత్య మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
మున్సిపాలిటీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


