హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచారం ప్రాజెక్టు నుంచి 232 క్యూసెక్కుల నీరు

KMR: ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు సాగునీటి ఆధారమైన పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 232 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ అక్షయ్‌కుమార్ తెలిపారు. మరో 36 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేక వరద ప్రవాహం లేదని తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 18 అడుగులుగా ఉందన్నారు.