VKB: తాండూరులోని శ్రీ కాళికా దేవి, శ్రీ నగరేశ్వర స్వామి, శ్రీ సీతారాంపేట హనుమాన్ దేవాలయాలకు పాలక వర్గ మండలి సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తాండూరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి టి. నరేందర్ తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. 20 రోజుల్లో రంగారెడ్డి దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌కు దరఖాస్తులను సమర్పించాలన్నారు.
తెలంగాణ
దరఖాస్తుల ఆహ్వానం


