హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు మరో అవకాశం

SRD: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ ప్రవేశాల గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు డీఈవో వెంకటస్వామి తెలిపారు. రకరకాల కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాల కోసం సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.