BDK: బూర్గంపహాడ్ మండలం జింకలగూడెంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 40 వాహనాలను సీజ్ చేశారు. గంజాయి, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలపై సమాచారం అందించాలని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ సూచించారు. నిరంతరం పోలీసులు నిఘా ఉంటుందని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: జింకలగూడెంలో 40 వాహనాలు సీజ్


