వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన మున్వర్‌గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
తాండూర్‌లో వ్యక్తి దారుణ హత్య


