ASF: వేములవాడలో అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీలకు ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి కొట్నాక రోషన్ (10వ తరగతి) ఎంపికయ్యాడు. ఈ మేరకు హెచ్ఎం చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయుడు అరవింద్ తెలిపారు. రోషన్ను ఐటీడీఏ పీవో మందా మకరంద్, డీడీ జాదవ్ అంబాజీ అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీలకు ఎంపిక


