హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ అధికారులపై దాడి.. కేసు నమోదు

KMR: ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికేస్తున్నారంటూ సమాచారంతో వెళ్లిన ఫారెస్ట్ బీట్ అధికారులు నాయికోటి శ్రీనివాస్, ప్రదీప్‌‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. విధులకు ఆటంకం కలిగించిన గంగారం, చందులతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్‌ఐ రాజు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.