హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ ప్రాంతంలో అధికారుల తనిఖీలు

MHBD: గార్ల(మం)నాగారం, సిరిపురం గ్రామాల శివారులోని రక్షిత అటవీ ప్రాంతంలోని 42, 43, 44 కంపార్ట్‌మెంట్లలో రెవెన్యూ, అటవీ, గనుల శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. బేరైటీస్ ఖనిజం అక్రమ తవ్వకాలు, రవాణా జరగడం లేదని గుర్తించారు. ఇటీవల తవ్వకాల ఆనవాళ్లు కూడా కనిపించలేదన్నారు. అటవీ సిబ్బంది, బేస్ క్యాంప్ వాచర్లు 24 గంటలూ నిఘా కొనసాగిస్తామన్నారు.