MLG: దసరా పండుగ నేపథ్యంలో ములుగు జిల్లాలో బొడ్డెమ్మ వేడుకలు గురువారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ములుగులోని వీవర్స్ కాలనీలో మహిళలు, చిన్నారులు బొడ్డెమ్మను అందంగా పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లోనూ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొనగా, వృద్ధులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ
'పల్లెల్లో ప్రారంభమైన బొడ్డెమ్మ సందడి'


