హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మాంసం విక్రయాలపై నిషేధం

MBNR: గాంధీ జయంతి సందర్భంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అక్టోబర్ 2న మాంసం విక్రయాలు, జంతు హత్యలపై నిషేధం విధించినట్లు కమిషనర్ గిరీష్ తెలిపారు. కోడి, మటన్, చేపల విక్రయాలు పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు.