HNK: శాయంపేట మండలం కొత్తగట్టు–సింగారం ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పరకాల నుంచి హన్మకొండ వైపు ట్రాక్టర్‌పై వెళ్తున్న యజ్జెల శ్రీను (25)ను మందారిపేట దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన కాంక్రీట్ లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తాపడగా, డ్రైవర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కాంక్రీట్ లారీ ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి


