హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువు మండలాలపై నివేదిక ఇవ్వండి: మంత్రి

KMM: జిల్లాలో వర్షాభావ ప్రాంతాలను గుర్తించి, కరువు మండలాల ప్రతిపాదనల వివరాలను వెంటనే అందించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షపాతం, సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల ఆధారంగా కరువు తీవ్రతను అంచనా వేయాలన్నారు. మద్దతు ధర ఉన్న పంటలను కేంద్రం వంద శాతం కొనుగోలు చేయాలని కోరారు.