GDWL: జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడులో వెలసిన జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణానది జనాలతో అభిషేకం, ఆకు పూజ, హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం కలిగించి తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారికి ఇష్టమైన రోజులో ఒకటైన శుక్రవారం కావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
తెలంగాణ
జమ్మిచేడు జమ్మలమ్మకు ప్రత్యేక పూజలు


