హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాత్మ పర్యటనకు గాంధీచౌక్ సజీవ సాక్ష్యం

KMM: స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో 1946 ఫిబ్రవరి 5న మహాత్మా గాంధీ ఖమ్మంలో పర్యటించారు. విజయవాడ నుంచి రైలులో వచ్చిన ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ సమీపంలో బాపూజీ ప్రసంగించిన ఆ ప్రాంతమే కాలక్రమేణా గాంధీచౌక్‌గా మారిందని, ఆయన జ్ఞాపకార్థం అక్కడ ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహం నాటి చారిత్రక అనుబంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని స్థానికులు చెబుతున్నారు.