MDK: పాపన్నపేట మండల కేంద్రంలోని అయ్యప్ప గుడి వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన జేసీబీ తీవ్రంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన బైకర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు టేక్మాల్ మండలం ఖాదులూర్ తండావాసులుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి


