హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డ్రైనేజీలు లేక రహదారిపైకి మురుగునీరు

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోంది. మురుగు కాలువ లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు నేరుగా రోడ్డుపైకి చేరుతున్నాయి. దీంతో రహదారి దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై అధికారులు స్పందించి మురుగు కాలువలు నిర్మించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.