ASF: బెజ్జూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వాహనాలను నెమ్మదిగా నడిపారు. పొగమంచు ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళ పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: బెజ్జూరులో అలుముకున్న దట్టమైన పొగమంచు


