హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేబీఆర్ పార్క్‌లో నేటి నుంచి 'వైల్డ్ లైఫ్ వీక్' వేడుకలు

HYD: కేబీఆర్ నేషనల్ పార్క్‌లో తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి 8 వరకు 'వైల్డ్ లైఫ్ వీక్ సెలబ్రేషన్స్' జరగనున్నాయి. వన్యప్రాణులు, జీవవైవిధ్యం, ప్రకృతి పరిరక్షణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. వారం రోజుల పాటు రోజూ ఉ.7 నుంచి 9 గంటల వరకు నిపుణుల ఆధ్వర్యంలో పలు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.