మహబూబాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమనగల్‌కు చెందిన అభి (7) చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుధవారం సాయంత్రం తొర్రూరు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బాలుడిని ధర్మారపు ప్రశాంత్ బైక్ తో ఢీకొట్టాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాయనమ్మ వెంకటమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ బాలుడి మృతి


