హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉత్కటాసనం వల్ల కలిగే ఉపయోగాలు

ఉత్కటాసనం అనేది నిలబడి చేసే యోగాసనం. దీనిని 'కుర్చీ ఆసనం' అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వేస్తే మోకాళ్లు, చీలమండలు, తొడలు, పిక్కల కండరాలు దృఢంగా మారుతాయి. వెన్నెముకను నిటారుగా ఉంచి, వీపు కండరాలను బలోపేతం చేస్తుంది. వెన్నునొప్పి తగ్గుతుంది. శరీరానికి మంచి బ్యాలెన్స్ ఇస్తుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. పొత్తికడుపులోని అవయవాలను ప్రేరేపిస్తుంది. మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.