హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు..!

ఏ సమస్య లేకపోయినా సంవత్సరానికి ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీనివల్ల ఏదైనా సమస్య ప్రారంభ దశలో ఉంటే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నామని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. రక్తపోటు, షుగర్ స్థాయిలు, థైరాయిడ్ వంటి వాటిని క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం ఉత్తమం. ముందు జాగ్రత్తగా పరీక్షలు భవిష్యత్తులో వచ్చే పెను ప్రమాదాల నుంచి రక్షిస్తాయి.