హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

JGL: జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా జగిత్యాల ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఐఎంఏ, రెడ్‌‌క్రాస్, ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. మొత్తం 10 యూనిట్ల రక్తం దానం చేశారు. డీఎంహెచ్‌‌ఓ డాక్టర్ సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.