హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

NZB: మాక్లూర్ మండలంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలను కలిసి మండలంలోని సమస్యలను తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ సమస్యను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.