హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆపరేషన్ వికటించి బాలుడు కోమాలోకి..

SRPT : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆనందరావు ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించడంతో బాలుడు కోమాలోకి వెళ్లాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడికి ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.