హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన పూర్తి

JGL: రాయికల్ మండల పరిధిలో చేయూత పెన్షన్ కోసం వచ్చిన 918 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సెప్టెంబర్ 30తో పూర్తయినట్లు ఎంపీడీవో బి.చిరంజీవి తెలిపారు. దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు సహకరించిన సర్పంచులు, వెరిఫికేషన్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి ఎంపీడీవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.