హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మధ్యాహ్నం అతిగా తింటున్నారా..?

మధ్యాహ్నం అతిగా తినడం ఆరోగ్యానికి ప్రమాదమే. భోజనం తర్వాత విపరీతమైన నీరసం, సోమరితనం ఆవహించి రోజంతా ఉత్సాహం కోల్పోతారు. ఇది శరీర బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు, చివరికి మధుమేహానికి దారితీస్తుంది. ఈ అలవాటును మార్చుకోవడానికి కంచంలో కూరగాయలు, సలాడ్స్ పెంచుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా, నమిలి తినాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పరిమితంగా తినడం అలవాటు చేసుకోవాలి.