హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లాలో నెల రోజుల పాటు సెక్షన్‌ 30 అమలు'

WNP: శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లావ్యాప్తంగా ఈ నెల 31 వరకు సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజాధనానికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడరాదని సూచించారు.