హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరద గాయానికి నేటికీ 17 ఏళ్లు

GDWL: కృష్ణ, తుంగభద్ర నదుల వరదల కారణంగా అలంపూర్ పట్టణం 2009 అక్టోబర్ 2న జలమయమైన ఘటనకు నేటితో 17 ఏళ్లు పూర్తవుతోంది. ఆ వరదల్లో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, నేటికీ న్యాయం జరగలేదు. పాలకులు స్పందించి తక్షణమే వరద బాధితులకు న్యాయం చేయాలని అలంపూర్ ప్రజలు కోరుతున్నారు.