WGL: సంగెం మండలం కుంటపల్లి పంచాయతీ కార్యాలయంలో సామగ్రిని ధ్వంసం చేసిన ఘటనలో ఒకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన కావటి సాంబయ్య బుధవారం రాత్రి కార్యాలయంలోని పైపులు, స్టార్టర్‌ను ధ్వంసం చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. పంచాయతీ ఉద్యోగి చిర్ర ప్రభాకర్ గురువారం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
పంచాయతీ సామగ్రి ధ్వంసం.. ఒకరిపై కేసు


