హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీవోడబ్ల్యూ నాయకురాలు పూలక్క మృతి

WGL: నర్సంపేట మండలం సర్వాపురానికి చెందిన ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలు సిలువేరు పూలక్క (జ్వరంతో) గురువారం మృతి చెందారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పార్టీ నాయకులు తెలిపారు. పూలక్క మృతి మహిళా ఉద్యమాలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు.