హైదరాబాద్: 28°C
తెలంగాణ

కులాంతర వివాహం.. వ్యక్తి దారుణ హత్య

NLG: చైతన్యపురిలో కులాంతర వివాహం చేసుకున్న బంటు వెంకటేశ్వర్లు (37) దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెంకటేశ్వర్లుపై బావమరుదులు కళ్లలో కారం చల్లి, విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.