BHPL: ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జూదురావుపేటకు చెందిన పోతెం రజిత (20) కరీంనగర్‌లో జీఎన్‌ఎం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం వసతి గృహంలోని స్నానాల గదిలో అపస్మారక స్థితిలో కనిపించగా, ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి


