హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

WGL: సంగెంమండలం చింతలపల్లికి చెందిన భోజనపు కళ్యాణ్‌కుమార్‌ మృతితో విషాదం నెలకొంది. విజయవాడలో యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న కళ్యాణ్‌కుమార్‌ బుధవారం తన గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం గురువారం రాత్రి స్వగ్రామానికి చేరడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.