హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మాంసం విక్రయాలు నిషేధం: కమిషనర్‌

KMM: గాంధీ జయంతి సందర్భంగా కల్లూరు పురపాలక సంఘం పరిధిలో నేడు (శుక్రవారం) మాంసం, చికెన్‌ విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ జి. సాయి కృష్ణ రెడ్డి తెలిపారు. దుకాణాలను మూసివేసి నిబంధనలు పాటించాలని వ్యాపారులకు సూచించారు. విక్రయాలు నిర్వహిస్తే ట్రేడ్‌ లైసెన్స్‌ రద్దుతో పాటు జరిమానా విధిస్తామని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.